Friday, November 25, 2011

పెద్దలకు మాత్రమే


ఊపుమీదుంది చలికాలం
వేసెయ్యాలి వెచ్చని గాలం
విహంగం శ్రుంగార వినువీధిన
సరస సరస్సున రసాస్వాదన   
ఎప్పుడో పారిపోయాడు భానుడు
దుప్పటి తన్నేశాడు నెలబాలుడు
దీపమార్పితే చాలు దేహం రాజుకుంటూంది
నువ్వింకా రాలేదని తెగ గింజుకుంటూంది
నీ కన్నులు కమ్మని జున్నులు
అధరాలు మ్రుదుమధురాలు
ఆ ధరహాసాలు శ్రుంగార ఇతిహాసాలు
వురుములు మెరుపులు ఒంపు సొంపులు
అదను చూసి మదనుని కవ్వింపులు
కడదకా సాగిన వాలు జడ
నాదేనంది పెరుగువడ
చెలీ నెచ్చెలీ నులివెచ్చని మది గిచ్చనీ
సమ్మోహినీ ఈ రసధుని రేయంతా రగిలించనీ
కామినీ, గజగామినీ, రసభోగినీ చెలరేగనీ
ఇంతీ దమయంతీ పూబంతీ వరించనీ, పులకించనీ 
కోమలీ పురివిప్పిన నెమలీ ప్రణయ వీణలు మీటనీ
రమ్మని సరసమ్మని మధురమ్మని పిలిచావె జవ్వని
జాగేల మదనిక పద ఇక వెలిగించు తారాజువ్వని

No comments:

Post a Comment