Tuesday, November 22, 2011

‘ఇంట’రునెట్టు



అబ్బబ్బో ఈ అంతర్జాలం
మహా గొప్ప మాయాజాలం
ప్రతివారికీ వేస్తుంది గాలం
పనిచేస్తుంది ఆరుగాలం
వుందంటే ఇంట్లో ఇంటెర్నెట్టు
సమాచారం మీ ముందుకు నెట్టు
వెయ్యాలన్నా పెసరట్టు
వెతకాల్సిందే ఈ నెట్టు
ఆఫీసర్, మేనెజర్, ప్యూనూ క్లర్కు
పెంచుకుంటారు తమ తమ నెట్వర్కు
క్రోము, ఫైరుఫాక్స్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్లు
వెబ్ సైట్లకు తొడిగిన అందమైన ట్రౌజర్లు
ఎవడికొచ్చిన ఐడియా
ఇంత గొప్ప వికిపీడియా
ఎల్లలు హద్దులు లేవయా
ఇది సమాచార మాఫియా
అవినీతి బండికి వేసిన బ్రేక్సు
అసాంజీ వదిలిన వికిలీక్సు
వారందిస్తే సీక్రెట్ కేబుల్సు
మారిపొతాయి బేర్సు, బుల్సు 
ఏ మూలన వున్నా సూదులూ
ఇట్టే వెతికేస్తుంది గూగులూ
చిట్టిపొట్టి మాటల ట్విట్టరు
లేపింది మన నోటి షట్టరు
స్నేహానికిస్తుంది కిక్కు
భళిరా ఈ ఫేసుబుక్కు
అందరికుంటాయి గోడలు
వినిపిస్తాయి  వారి గోడులు
కోయిల కూతల కూహూ కూహూ
మోసుకొస్తుంది మెసెంజర్ యాహూ
ఏదైనా అమ్మాలంటే తెలివిగా
ఈబే లో పెట్టెయ్యి ముందుగా
ఆకాశానికి వేసెయ్ నిచ్చెనలు
నెట్ లోనే చేసెయ్ అర్చనలు
ఈ కాలం పెళ్ళిళ్ళ పేరయ్య
పనికూడా దీనిదే భయ్యా
అమ్మాయికి కొట్టాలన్నా సైటు
దొరక్కపోదు ఏదో వెబ్ సైటు
డేటింగు, మీటింగు, పదిమందితొ ఫైటింగు
అన్నీ దొరుకుతాయి ఇదెక్కడి  ఫిటింగు
శ్రుంగారంగా నంగా నంగా బొమ్మలు  
చూస్తూ గదిపేస్తారు కొందరు వాజమ్మలు
దేనికైనా వుంటుంది బొమ్మా బొరుసూ 
తెలుసుకుని వాడుకో తెలివిగా బాసూ

1 comment:

  1. సూపరండి..చివరగా ఇచ్చిన సందేశం కూడా బాగుంది

    ReplyDelete