Friday, November 11, 2011

హైదరాబాదు


 
హైదరాబాదు రహదారులు
నరకానికి అవి అడ్డదారులు
వేశావంటే బయటకు అడుగు
చుక్కలు కనబడకుంటే నన్నడుగు
లెఫ్టూ రైటూ జనాలకి తెలియవు
ట్రాఫిక్ లైట్లు ఎన్నడూ వెలగవు
పొలీసులు నడిచే ఏటీయెమ్ములు
జేబులు నింపును అవినీతి సొమ్ములు
పామరులకు తప్పవు చలానులు 
ధనవంతులకేమొ సలాములు
రాత్రంతా రోడ్లపై గొప్పోళ్ళ పిల్లల రేసులు
తెల్లారితే బస్సులకోసం రన్నింగ్ రేసులు
బండున్న ప్రతివాడూ ప్రతిభావంతుడు
రోడ్డెక్కితే అశోకవనంలో హనుమంతుడు
నగరానికి ముద్దుపేరు హైటెక్ సిటీ
దారంతా శవాల గుట్టలు వాట్ పిటీ

No comments:

Post a Comment