మండుటెండలో మంచు వానరా తెలుగు వారికి ఆవకాయ
ఎడారి బాటలొ నీటి ఊటరా ఇంటి నారికి ఆవకాయ
ముద్ద పప్పూ మంచి నెయ్యీ వేడి అన్నం కలిపి కొడితివా
ఆగకుండా జారిపోదా మరి కడుపులోనికి ఆవకాయ
చేదు వగరుల మేలు కలయిక తాగుబోతుకి అమృతమ్మేగద
గొంతు లోకి జారగా స్వర్గమే మందుబాబుకి ఆవకాయ
బతుకు నడవనీ పూటగడవనీ బక్కచిక్కిన జనానికీ
ఉంటే చాలుగ అదే పదివేలు బీదవానికి ఆవకాయ
వివాహమంటే అది మాటలా మర్యాదలెంతగ చెయ్యాలొ
దొరకలేదంటే కుదరదోయీ పెళ్ళి విందుకి ఆవకాయ
నేడు ఉండీ రేపు పోయే ఆస్తులదేముంది ఈడూరీ
చెక్కుచెదరని సొత్తు గదరా మన తెలుగు జాతికి ఆవకాయ

Avakaaya goppadanam correctgaa chepparu iduri garu.. gazal baagundu
ReplyDeleteధన్యవాదాలు విమల గారూ
ReplyDelete