Tuesday, May 12, 2015

సెల్ఫీ

అపుడే పుట్టిన పాపాయికి అమ్మతో సెల్ఫీ
కొత్తగ పెళ్ళైన అమ్మాయికి అత్తతొ సెల్ఫీ  

అహరహము పదవికి వెంపర్లాటె రాజకీయం
లీడరుకి దొరకక దొరికిన కుర్చీతో సెల్ఫీ  

న్యాయ దేవతకి కళ్ళే లేవు - కాదనగలమా     
మన కండల వీరుడికేమో జడ్జీతొ సెల్ఫీ

రెండాకులు ఎక్కువే చదివిన అమ్మగారికీ  
అందాక పదవి కాపాడిన చెంచాతొ సెల్ఫీ 

చిన్ననాటి చిలిపి గుర్తులు మాసిపోతే యెలా  
అల్లరి పిల్లాడికి టీచర్ బెత్తంతొ సెల్ఫీ    
     
డబ్బుకి లోకం దాసోహమే అది నిజమేగా 
బాగా బలిసిన ఆసామికి ఆకలితొ సెల్ఫీ 

ఆసుపత్రికి అప్పుడపుడు వెడితేనే మంచిది    
రోజూ వచ్చె పేషంటు నర్సమ్మతో సెల్ఫీ 
  
ఎపుడూ చూస్తూ ఉంటె స్నేహం పెరగదా యేంటి
గజదొంగ గంగులు గాడికి పోలీసుతొ సెల్ఫీ  

మనుషులకేనా ప్రేమ, మాకు కూడా ఉందంటు 
అడవిలొ సింహానికి కుందేలు పిల్లతొ సెల్ఫీ   

తుదిదాక తపస్సు చేస్తె వచ్చేది ఏ దేవుడొ 
మధ్యలోనే ఆపిన మునికి మేనకతొ సెల్ఫీ      

2 comments:

  1. కాలానుగుణమైన కవిత, ఈడూరి గారూ. చాలా బాగుంది.

    ఆమధ్య జెఫ్రీ ఆర్చర్ భారతదేశం వచ్చినప్పుడు ఆయనతో జరిగిన ఓ ఇంటర్వ్యూ లో సెల్ఫీల పిచ్చి ఎంత వెర్రితలలు వేస్తోందో చెప్పాడు. ఆయన ఇచ్చిన ఓ ఉదాహరణ - రైలుపట్టాల మధ్య నిలబడి తన వెనుకనుంచి ట్రెయిన్ దూసుకొస్తుండగా సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడం ఎక్కువయిపోయిందిట యువతకి. ఫొటోకి అడ్జస్ట్ చేసుకోవటంలోనే కాలాతీతం అయిపోయి ఆ ట్రెయిన్ కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారుట.

    "వెరైటీ" కోసమో, "డిఫరెంట్" గా కనపడాలనో చేసే ఇటువంటి ప్రయత్నాలు ప్రాణాంతకంగా తయారవ్వచ్చు అనే విచక్షణ కూడా ఉండటంలేదు.

    ReplyDelete
  2. చాలా బాగుందండి.

    ReplyDelete