ఒక్కసారి మనుషులుగా మారుదాము యిపుడైనా
స్వార్ధ రహిత మంచితనం పంచుదాము యిపుడైనా
బీద బిక్కి కులం మతం అంతరాలనొదిలేసీ
బానిసత్వ సంకెళ్లను తెంచుదాము యిపుడైనా
నాకొడుకూ నాకూతురు నాపెళ్లాం అని కాదోయ్
విశ్వమంత మనదేనని చాటుదాము యిపుడైనా
ఆయుధాలు ఎన్నున్నా ఆత్మశాంతి దొరికేనా
గొంతులెత్తి స్నేహగీతి పాడుదాము యిపుడైనా
మందిరాలు, మసీదులూ చర్చిలేల ఈడూరీ
మనసుల్లో దేవుడినే నిలుపుదాము యిపుడైనా
అహంకార సెగలతోటి రగులుతోంది భూగోళం
రోజుకొక్క పూలమొక్క నాటుదాము యిపుడైనా
అందమైన అక్షరమాల.
ReplyDeleteబ్యూటిఫుల్ గజల్ అభినందనలు 👌👍🙏
ReplyDeleteధన్యవాదాలు
DeleteThis comment has been removed by the author.
ReplyDelete