మొదటిసారి నిన్నుచూసి మనసునెలా జార్చానో తెలియలేదు
రాసుకున్న ప్రేమలేఖ నీదరికెలా చేర్చానొ తెలియలేదు
చినదానా ఉడుముపట్టు పట్టి నీవు బిగుసుకోని కూచుంటే
ముగ్గులోకి లాగేందుకు ఏమి వండి వార్చానో తెలియలేదు
నువ్వు వచ్చి చేరాకా రాకెట్లా సాగుతోంది ఈ పయనం
ప్రేమలోకి దిగినాకా ఏ గేరుని మార్చానో తెలియలేదు
పరిమళించు మనసుతోటి పల్లవిలా చేరావే ఎదలోనికి
పాడుకున్న ప్రేమగీతికేరాగం కూర్చానో తెలియలేదు
ఈడూరికి నీవులేక ఘడియైనా యుగమేలే ఈ జగాన
గొంతుదాటి జారిపడని గరళమెలా ఓర్చానో తెలియలేదు

ప్రేమలేఖ ప్రణయకలాపం బాగుంది. :-)
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారు
Delete
ReplyDeleteపరిమళము మనసు పల్లవి
సరాగముల గాంచెనోయి చక్కని దానా!
దరిచే రావోయి, యెలా
గరళము నోర్చితిని తెలియగను రాలేదోయ్ !
జిలేబి
కందపు మకరందం బాగుంది జిలేబి గారు
ReplyDelete