Monday, September 19, 2016

మేఘం

ప్రియురాలీ ప్రేమలాగ కురిసిందొక మేఘం
పట్టుజరీ అంచులాగ మెరిసిందొక మేఘం

పచ్చచీర కట్టుకున్న పుడమిలాగ నవ్వుతు 
ప్రియునిగన్న ప్రియురాలై మురిసిందొక మేఘం 

ఆకసాన నక్షత్రపు సమూహాల సాక్షిగ 
వలపువిరుల జడివానలొ తడిసిందొక మేఘం

తాజుమహలు చూడగానె పెరుగునులే ప్రేమలు 
ప్రేమగాధ స్మారకమై వెలిసిందొక మేఘం

ఈడూరీ బరువెక్కిన హృదయంతో నేడూ   
విరహినిలా చెలికాడిని కసిరిందొక మేఘం

2 comments:

  1. మీ కవిత అమోఘం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మార్పిత గారు

      Delete