Sunday, July 12, 2015

జిందగీ

ఎన్నొ ఏళ్ళ మధ్యంలా ఊరిస్తోంది జిందగీ 
ఎదురింట్లో పిల్ల లాగ కవ్విస్తోంది జిందగీ

అందనిదే అందినట్టు అల్లరులే చేస్తుంటే   
ఎడారిలో ఎండమావి అనిపిస్తోంది జిందగీ 

కన్ను మూసి తెరుచు లోపు కనుమరుగౌ తారలాగ
మనసుతోటి దోబూచులె ఆడిస్తోంది జిందగీ

ఏ నిముషం ఏమగునో ఎవరికెరుక ఈజగతిలొ 
సంద్రంలో కెరటంలా పడిలేస్తోంది జిందగీ 

ఐదేళ్ళకు ఒక్కసారి అగుపించే నాయకుడా
అన్నట్టుగ ఒకోసారి మురిపిస్తోంది జిందగీ

తప్పొప్పులు అతిసహజం నాటకాలు జీవితాలు 
టీవీలలొ సీరియల్సు మరిపిస్తోంది జిందగీ  

అమాయకపు చేపపిల్ల నువ్వేనా ఈడూరీ 
నెమ్మదిగా ఎరవేసీ వలలేస్తోంది జిందగీ 

1 comment:

  1. జిందగీ తీరుతెన్నులు బాగా చూపించారు.. ఆఖరి షేర్ హైలెట్ గా ఉంది

    ReplyDelete