ఆ నగరం చుట్టూ గోదారి లేదు
క్రిష్ణమ్మా లేదు
నగరానికి ఓ పక్క సముద్రమూ లేదు
అయినా ఆ నగరానికి వరదొచ్చింది
కనిపించిన నేలంతా
కాంక్రీటుగా మారుస్తుంటే
ఇంకలేని నీరేమో
ప్రతి ఇంటినీ ముంచేసింది
పేదవాని స్వేదంలా
వరదలై పారుతోంది
నాగరీకుడా గుర్తించావా నీ ప్రాణం పోకడ
ఇకనైనా మట్టిని సిమెంటుగా మార్చడం మానెయ్యి
the last line is excellent annayya
ReplyDelete