ఆరు రాబందులు నీమీద పడి కుళ్ళబొడిచినా నువ్వు ధైర్యంగా బతుకు పోరాటం చేశావు నిద్రాణమై ఉన్న ఈ దేశ యువతని కదన రంగం వైపు మరల్చి నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోయావు ఓ యోధురాలా నీ దేహం నేలకొరిగినా నీవందించిన చైతన్యం బతికే ఉంది బతికే ఉంటుంది............
తెలవారుతూనే పొగలు కక్కే కాఫీ ఒక్కటుచ్చుకుంటే నీ రోజంతా హ్యాపీ కసబ్ లాంటి కరుడు గట్టిన పాపి ఒక్క కాఫీతో కౌగలిచుకోడా నిను చెయి జాపి పెళ్ళిచూపుల్లో అమ్మాయిస్తే కాఫీ లైఫంతా అయిపోతుంది సాఫీ ఇంటికి పిలిచి ఆఫీసరుకిస్తే కాఫీ మేనేజరు సీటులో పెడతాడు నిన్ను లేపి మంత్రిగారికిస్తే మంచి కప్పు కాఫీ రైతుల రుణాలన్నీ ఒక్క గంటలో మాఫీ