Friday, December 14, 2012


అప్పడిగే మన అప్పారావు
ఎపుడో కలిసిన సుబ్బారావు
పక్కింటి పిన్నిగారు
చొంగ కార్చే తాతగారు
వీళ్ళంతా మన బాపు బొమ్మలే 

కాణిపాకం గణపయ్య
తిరుమల వెంకయ్య
భద్రాచల రామయ్య 
శ్రీశైలం శివయ్య 
వీళ్ళంతా మన బాపు బొమ్మలే 

శ్రుంగారమొలికించే దంపతులు
గోముగా చూసే దమయంతులు
స్నానాలు చేసే ఇంతులు
నక్కి నక్కి చూసే పంతులు
వీళ్ళంతా మన బాపు బొమ్మలే  

తెలుగుతనం గీయాలన్నా
తెలుగురాత రాయాలన్నా
తెలుగనేది ఎన్నాళ్ళున్నా
నిన్న నేడు రేపు
మనకుంటాడు బాపు!!!!
(బాపు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో....) 

షిర్డిసాయి మంగళహారతి


మంగళము సాయినాధకి ద్వారకామయి నివాసికి 
మంగళము అఖిలాండకోటి నాయకునకు 
మంగళము సాయినాధకి ద్వారకామయి నివాసికి 
మంగళము అఖిలాండకోటి నాయకునకు  

మంగళము భక్తజన శులభునకు 
మంగళము భక్తజన శులభునకు   
మంగళము షిర్డిపురాధీశునకును 

జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

Friday, November 23, 2012

కాఫీ


తెలవారుతూనే పొగలు కక్కే కాఫీ
ఒక్కటుచ్చుకుంటే నీ రోజంతా హ్యాపీ
కసబ్ లాంటి కరుడు గట్టిన పాపి
ఒక్క కాఫీతో కౌగలిచుకోడా నిను చెయి జాపి
పెళ్ళిచూపుల్లో అమ్మాయిస్తే కాఫీ
లైఫంతా అయిపోతుంది సాఫీ
ఇంటికి పిలిచి ఆఫీసరుకిస్తే కాఫీ
మేనేజరు సీటులో పెడతాడు నిన్ను లేపి
మంత్రిగారికిస్తే మంచి కప్పు కాఫీ
రైతుల రుణాలన్నీ ఒక్క గంటలో మాఫీ

Monday, November 19, 2012

చాలదా?




ప్రేమకు ఎవరైతే ఏమిటి మనసుంటే చాలదా?
దేవుడు ఎవరైతే ఏమిటి గురి వుంటే చాలదా?

నేనెక్కువ నువు తక్కువ అన్నదెవరు నేస్తమా
ప్రాంతాలు ఏవైతే ఏమిటి కలిసుంటే చాలదా?

మానవ జన్మన్నది  దేవుడిచ్చిన వరమేగా
కులమేదైతే ఏమిటి మనిషిగ వుంటే చాలదా?

పుస్తకాలు తిరగేస్తే ఆత్మ శుద్ధి అవుతుందా   
చదువేదైతే ఏమిటి విజ్ఞత వుంటే చాలదా?

సేవే గమ్యమైతే అధికారం మార్గమా 
పదవేదైతే ఏమిటి పాటవముంటే చాలదా? 

అలుపెరుగక అనుకున్నది రాసెయ్ ఈడూరీ
అవార్డు రాకుంటే ఏమిటి చప్పట్లుంటే చాలదా? 

Friday, November 16, 2012

వలపు




నీ వలపు మది తాకిన సమీరం లాగుంది
ఆ తలపు నను వీడని భ్రమరం లాగుంది


నీ చూపు తాకగానె శిలనైన నాకు
కన్ను కన్ను కలపడమే సమరం లాగుంది


ప్రేమ అనే పదానికి ఇంత పటిమ ఎక్కడిదో
ఆ ఊహే వేసవిలో శిశిరం లాగుంది


ఎంత కాదన్నా నీ వెంటే నడుస్తున్నా
నీ తీరే అసమ్మతి శిబిరం లాగుంది


ఇన్ని నెలల నిరీక్షణ ముగిసేనా తొందరలో
నీ వాలుచూపు ప్రేమాలయ శిఖరం లాగుంది


చెరిగిపోని ప్రణయాలు చరిత్రలో ఎన్నున్నా
ఈడూరీ, నీ కధ అమరం లాగుంది

Wednesday, November 14, 2012

మరణం తరువాత


చూడాలని ఉంది నాకు చందమామ వెనుక కూడా
చేరాలని ఉంది నాకు దిగంతాల ఆవల కూడా

ఉరకలేసే లేత మనసు అణిగి మణిగి ఉండలేదు   
ఆడాలని ఉంది నాకు బాల్యం  తరువాత కూడా

మనసు తోడు రాకుంటే విజయానికి విలువెక్కడిది
గెలవాలని ఉంది నాకు ఓటమి తరువాత కూడా

ప్రేమ అమరమనుకుంటే అంతమన్న మాటెందుకు
రమించాలనుంది నాకు ప్రణయం తరువాత కూడా

కానరాని లోకాలపై మమకారం నాకెందుకు
బతకాలని ఉంది నాకు మరణం తరువాత కూడా

Thursday, November 8, 2012

పాట


ఏంది గురూ ఎదురింటావిడ యమాగ ఉంటుందీ
రోజురోజుకీ మా ఇంటావిడ బోరు కొడుతూందీ //ఏంది గురూ//

ఏ లేడీకేసి చూసినా బాడీ వేడిగ అవుతుందీ
శ్రీమతి వస్తే చల్లగ మారి చతికిలబడుతుందీ
అప్పుడెప్పుడో చక్కని చుక్క అన్నది గుర్తుందీ 
అదే మనిషిని ఇప్పుడుచూస్తే హిడింబ లాగుందీ  //ఏంది గురూ//

ఏం గొప్పోడని పక్కొడికి రంభే దొరికిందీ
నాకేమో ఈ ఏకు కాస్తా మేకై కూచుందీ
ఊరించే ఒంపుసొంపులు ఉన్నా లేకున్నా 
నాజూకైన పెళ్ళాన్నిస్తె దేవుడి సొమ్మేంపొయింది  //ఏంది గురూ//