Tuesday, April 4, 2017

నా మొగుడు

ఎవరెస్టెక్కి జెండా పాతుట మరిచొస్తాడే నా మొగుడు
బజారుకెళ్ళి సరుకుల సంచీ వదిలొస్తాడే నా మొగుడు

సూటిగ చెబితె అర్థంకాదు హాస్యం అసలు బుర్రకెక్కదు
సినిమాకెడితే సీనుసీనుకి విసిగిస్తాడే నా మొగుడు

వివరంలేదు విషయంలేదు మెదడుకి పదును మచ్చుకి లేదు
డిస్కోకెళ్ళీ భరత నాట్యం చేసొస్తాడే నా మొగుడు

వంటకి వారు ముందుకు రారు తిండికి సారు దూరం కారు
సాంబార్లోకీ సగ్గుబియ్యము పోపేస్తాడే నా మొగుడు

బానెడు పొట్ట, జానెడు పొడుగు ఆటలలోన అడుగే పడదు
క్రికెట్ బంతితో టెన్నిసాటే ఆడేస్తాడే నా మొగుడు

3 comments:

  1. కవిత బావుంది. పెళ్ళాంమీద కూడా ఒకటి వ్రాసేయండి.

    ReplyDelete
  2. బాగుంది sir....
    చాలా చమత్కారంగా....

    ReplyDelete