నిన్ను నువ్వు
ఒకసారి పరికించి చూసుకో
పేరుకున్న మలినాల్ని
కరిగించి చూసుకో
చిన్ని చిన్ని
సరదాలె గద జీవితమంటే
మళ్ళీ బాలుడివై
పులకించి చూసుకో
ఒక్కసారే కద
వచ్చేది మానవ జన్మ
నీ నోట మంచి
మాట పలికించి చూసుకో
చిల్లర తగాదాలు
ప్రగతికే అగాధాలు
అనుమానపు తెరలన్ని
తొలగించి చూసుకో
వారు లేక నీకు
రాదుగదా ఈ ఉనికి
అమ్మ నానల్ని
సదా అలరించి చూసుకో
నీకు తోడుగా
రాదుగ ఎంత డబ్బున్నా
అభాగ్యుల జీవితాలు
మురిపించి చూసుకో
మనిషి మనిషి
కాకుంటె మనిషికేది మనుగడ
మానవత్వమె ఎపుడూ
కురిపించి చూసుకో
నిరంతరం మారేది
మార్పే కద ఈడూరి
పాషాణ హృదయాలను
కదిలించి చూసుకో
No comments:
Post a Comment