మనసు యింతగా ఎగిరి పడుతోంది ఎందుకో
లోకం కొత్తగా కనబడుతోంది ఎందుకో
తను నిన్న తిరిగిన పూల తోటే కదా ఇది
గులాబి వింతగ మిడిసిపడితోంది ఎందుకో
ఆమె గానము చెవులనింకా తాకుతోందా
కోయిల అంతగ మధనపడుతోంది ఎందుకో
ఊహలెంతగ అల్లగలవో ప్రణయ బంధము
మది పులకింతగ పరుగుపెడుతోంది ఎందుకో
చెలిమోముతో పోల్చినందుకేమో జాబిలి
పాలపుంతగా మురిసిపడుతోంది ఎందుకో
ఈడూరి చెలిని చేరే సమయమేమో ఇది
తనువు యింతగా తపన పడుతోంది ఎందుకో
లోకం కొత్తగా కనబడుతోంది ఎందుకో
తను నిన్న తిరిగిన పూల తోటే కదా ఇది
గులాబి వింతగ మిడిసిపడితోంది ఎందుకో
ఆమె గానము చెవులనింకా తాకుతోందా
కోయిల అంతగ మధనపడుతోంది ఎందుకో
ఊహలెంతగ అల్లగలవో ప్రణయ బంధము
మది పులకింతగ పరుగుపెడుతోంది ఎందుకో
చెలిమోముతో పోల్చినందుకేమో జాబిలి
పాలపుంతగా మురిసిపడుతోంది ఎందుకో
ఈడూరి చెలిని చేరే సమయమేమో ఇది
తనువు యింతగా తపన పడుతోంది ఎందుకో
No comments:
Post a Comment