Tuesday, December 10, 2013

ఢిల్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. బీజేపీ, ఆం అద్మీ పార్టీలు ప్రతిపక్షంలో కూచుంటామంటూ ప్రకటించడంతో నెలకొన్న అనిస్చిత పరిస్థితిపై నా స్పందన

ఢిల్లీలో ఆం ఆద్మీ 
చీపురెట్టి ఊడ్చినా
కాంగిరేసుకి బుద్ధి రాదు
ఎంతసేపు ఏడ్చినా 

చేవలేని రాహులే
దేవుడంట వీళ్ళకి
డెమోక్రసీ ఇంజను
నడుస్తుందా నీళ్ళకి? 

ప్రతిపక్షం మాదంటూ
బిగుసుకున్న కేజ్రీవాలు
ఇంతలోనే చదివాడా
ఉద్ధండుల అనుభవాలు

అందుకుంటె తప్పేంటట 
కాంగిరేసు హస్తం 
అధికారం మీ చేతికిచ్చి 
అసలు రంగు మేం చూస్తాం  

చేతులు కట్టుకు కూచున్నారు
ఎందుకో బీజేపీ బేరగాళ్ళు 
లేదంటే దొరక్కపోరు 
ఒకరిద్దరు మాయగాళ్ళు 

మళ్ళీ ఎన్నికలొస్తే 
ప్రజలకేగా నష్టం
ఎన్నాళ్ళకు తీరుతుందో 
దేశానికి అరిష్టం 

1 comment:

  1. బాగా వ్రాసారు...ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో మంచి వాళ్ళుగా గుర్తించుకున్న వారు ఎక్కువ సేట్లు గెలిచారు. ఒకరు చీపిరికట్ట పార్టీ, మరొకరు వెలుగుల పార్టీ. కానీ, ఏం లాభం ఇద్దరూ ప్రజల పరిపాలనకి సంబంధించిన విషయాలలో శ్రద్ధ వహించకుండా, ఎవరి పట్టుదలలలో వారున్నారు.

    ఇదే ఈ పాటికి కాంగ్రెస్సుకి కనుక ఏ 20 సేట్లో వచ్చినట్లైతే, ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటులో ఉండేవారు....అది అఫిషియలో లేక అనఫిషియలో... ఈ మాత్రం శ్రధ మంచి పార్టీలుగా ముద్రవేసుకున్న వారికి లేకపొతే వారి మంచితనం ఎవరికోసం...???

    అందుకనే అన్నారు...."అసమర్ధుడైన మిత్రుడుకన్నా, సమర్ధుడైన శత్రువు మేలు" అని... ఇప్పటికైనా మంచివాళ్ళుగా పేరెట్టుకున్న వారు బుద్ధి తెచ్చుకుని, ఇద్దరూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తె మంచిది. లేకపొతే, ప్రజలు..... మంచివారిని అసమర్ధులుగా భావించేట్లు చేసిన వారవుతారు..... కాంగ్రెస్సే నయమా...అనిపించేట్లుగా చేసిన వారవుతారు....

    ReplyDelete