Wednesday, February 22, 2012

ముళ్ళపూడి




ఎందరో వ్యక్తులు గుమిగూడి
అయ్యారేమో ఒక ముళ్ళపూడి

హాస్యానికి శ్రుష్టించారొక ఒరవడి
నవ్వాలంతా యుగాల తరబడి

వారి కధలు చదివితే  మనసుపడి
నవ్విస్తూనే పెట్టిస్తారు కంటతడి

స్నేహంలో బాపుగారికి సరిజోడి
ఇపుడా లోటును తీర్చే మనిషేడి?

3 comments:

  1. Beautiful sir. Great rhythm. Nicely written.

    ReplyDelete
  2. బాగా చెప్పారండీ! ఎంత దూరమయినా ఆయనలేని ఈయన ఉంటారా? మీ కలం పేరు కాళిదాసా లేక మీ అసలు పేరే కాళిదాసా?

    ReplyDelete
    Replies
    1. నా కలం పేరు, నా పేరు కూడా కాదు కాళిదాసు. నేను ఖాళీదాసు అని చెప్పడానికి కాస్త మార్చి కాళిదాసు అని అందరినీ ఏమార్చాను అంతే. అన్నట్లు మీరు రసజ్ఞ అంటే మీ పేరా లేక కలం పేరా లేక మీ బతుకు పుస్తకంలో ఒక పేరా రసజ్ఞతా?

      Delete