Friday, December 30, 2011

మరణం తరువాత


చూడాలని ఉంది నాకు చందమామ వెనుక కూడా
చేరాలని ఉంది నాకు దిగంతాల ఆవల కూడా
 
ఉరకలేసే లేత మనసు అణిగి మణిగి ఉండలేదు   
ఆడాలని ఉంది నాకు బాల్యం  తరువాత కూడా

మనసు తోడు రాకుంటే విజయానికి విలువెక్కడిది
గెలవాలని ఉంది నాకు ఓటమి తరువాత కూడా

ప్రేమ అమరమనుకుంటే అంతమన్న మాటెందుకు
రమించాలనుంది నాకు ప్రణయం తరువాత కూడా

కానరాని లోకాలపై మమకారం నాకెందుకు
బతకాలని ఉంది నాకు మరణం తరువాత కూడా

2 comments:

  1. ఎంతచక్కని భావ వ్యక్తీకరణ అండి...ఆడలనివుంది బాల్యం తరువాతకూడా...గెలవాలని ఉంది ఓటమితర్వతకుడా ....అన్నిటికన్నా "బ్రతకాలని ఉంది ...మరణం తర్వాత కుడా "..ఆహా ...చక్కగా రాసినారు hats off SI గారు "కవి కాళిదాసు " చక్కని Pen name !!(pen name ఎగా )

    ReplyDelete
  2. చాలా మంచి ఘజల్..అభినందనలు !

    ReplyDelete