Monday, December 5, 2011

శ్రీరామరాజ్యం

 
బాపూ గీసిన రమణీయ ద్రుశ్యం
ఇళయరాజా మోగించిన కమ్మని బాజా
ముళ్ళపూడివారి మురిపించే మాటలు
జొన్నవిత్తిన సొగసరి సాహిత్య సేధ్యం
కనులవిందు గావించె శ్రీరామరాజ్యం
వాల్మీకిగా వెలిగె ఎదురులేని అక్కినేని
వసిష్టుడు ఎవరో కాదయ్యా, మునుపటి బాలయ్య
రామునివేషం కట్టె నందమూరి మేటి, నేటి బాలయ్య
నయనానందముగ సీతమ్మను నిల్పిన తార నయనతార
దారాసింగు గారాల తనయుడు ఆంజనేయునిగ చేసె కను’విందు’
శ్రీకాంతుడైనాడు లక్ష్మణుడు, సమీరు భక్తినిరతుడు భరతుడు
లవుడుగా మురిపించినవాడు గౌరవుడు
కుశుడుగా అలరించెను ధనుష్
మగధీర కణ్ణన్ చేసెను గ్రాఫిక్కుల ట్రిక్కులు
పి ఆర్ కే రాజు కెమేరా చూపించెను నలుదిక్కులు
ఇంతగొప్ప చిత్రమందించిన నవాబు యలమంచిలి సాయిబాబు
మేటితారలతో ధాటిగా నిర్మించిరి శ్రీరామరాజ్యం
అట్టి రమణీయ రంగులకల బాపు రమణలకే సాధ్యం
నెలతప్పిన సీతమ్మ నడుముకు వేలాడిన చింతకాయ
భావవ్యక్తీకరణలో ముళ్ళపూడివారిది పెద్దతలకాయ
బాలహనుమంతుని చమక్కు రమణ మార్కు గిమ్మిక్కు
మంగళకరమౌ ఈ సినిమా చక్కగ చూపెను రాముని మహిమ
పుల్లయ్యగారి లవకుశ యుగయుగాల మధ్యం
నేటి తెలుగుతరానికి దక్కెను శ్రీరామరాజ్యం

1 comment:

  1. శ్రీరామరాజ్యం మూవీ గురించి రివ్యూ ఒక కమ్మని కవితగా చాలా చక్కగా వివరించారు శ్రీనివాస్ గారూ, నాకు నయనతార గురించి ఇంకో రెండు లైన్లు ఎక్కువరాసినా తక్కువకాదనిపించింది

    ReplyDelete