తులసిమొక్క ఇంటిముందు ఉంటేనే అందం
వాకిట్లో రంగవల్లి కంటేనే అందం
సౌందర్యం చిరునామా ఇంట్లోనే ఉందోయ్
తనువంతా పసుపు రాసుకుంటేనే అందం
బూస్టులోన ఏముందో ఎఱుకలేదు సీక్రెట్
పొద్దున్నే చద్దన్నం తింటేనే అందం
పసిపిల్లల హాసంలో ఉంటుందోయ్ స్వర్గం
చంటిపాపలెపుడు నవ్వుతుంటేనే అందం
పెద్దవారి మాట వింటె అదే గెలుపు మంత్రం
ఇంటిలోన పెద్దదిక్కులుంటేనే అందం
వందమంది కొడుకులుండి ఏంలాభం తల్లికి
రాముడంటి కొడుకునొకని కంటేనే అందం
ఈడూరీ తెల్లదొరలు వెళ్ళిపోయిరెపుడో
ఇండియాని భరతదేశమంటేనే అందం
వాకిట్లో రంగవల్లి కంటేనే అందం
సౌందర్యం చిరునామా ఇంట్లోనే ఉందోయ్
తనువంతా పసుపు రాసుకుంటేనే అందం
బూస్టులోన ఏముందో ఎఱుకలేదు సీక్రెట్
పొద్దున్నే చద్దన్నం తింటేనే అందం
పసిపిల్లల హాసంలో ఉంటుందోయ్ స్వర్గం
చంటిపాపలెపుడు నవ్వుతుంటేనే అందం
పెద్దవారి మాట వింటె అదే గెలుపు మంత్రం
ఇంటిలోన పెద్దదిక్కులుంటేనే అందం
వందమంది కొడుకులుండి ఏంలాభం తల్లికి
రాముడంటి కొడుకునొకని కంటేనే అందం
ఈడూరీ తెల్లదొరలు వెళ్ళిపోయిరెపుడో
ఇండియాని భరతదేశమంటేనే అందం
ఇంటిలోన పెద్దదిక్కులుంటేనే అందం..
ReplyDeleteee kotha samvatsaram lo iyna andharoo ee manchi pani gattigaa anukuntaaru anukundam.. gazal baagundi
అవునండీ పెద్దల్ని గౌరవించడం తగ్గిపోతున్నకొద్దీ మానవతా విలువలు పడిపోతున్నాయి.
Delete