Friday, April 1, 2016

అడగాలని ఉంది

నువ్వెందుకు వచ్చావో అడగాలని ఉంది 
నన్నెందుకు మెచ్చావో అడగాలని ఉంది

మోడుబారి అణగారిన ఈ జీవితానికి
విరులెందుకు తెచ్చావో అడగాలని ఉంది

కన్నీటికి కరువైన తరుణంలో చల్లని
సుఖమెందుకు ఇచ్చావో అడగాలని ఉంది

తీరా నిను చేరుకున్న ఈ చక్కని క్షణం 
సూదెందుకు గుచ్చావో అడగాలని ఉంది

మూగబోయి మసిబారిన గుండెకదా నాది
దాన్నెందుకు గిచ్చావో అడగాలని ఉంది

2 comments:

  1. అడగాలని ఉంటే కుదరదు; అడిగెయ్యండి! ఓ పనైపోతుంది బాబూ! :P

    ReplyDelete