Monday, June 29, 2015

నాకోసం

ఒక అందం నాకోసం నడచి వచ్చింది
తనువంతా పానుపుగా పరచి వచ్చింది 

గత జన్మల పుణ్యాలే నన్ను వరించే 
ఆ దేవత చిరునామా మరచి వచ్చింది 

ప్రేమంటే ఎపుడైనా జనులకి లోకువ 
ఈ సమాజ సంకెళ్ళను విరిచి వచ్చింది

నాకేమిటి పొమ్మంటూ ఎదురు పోరాడి 
ఎద గదులను విపులంగా తెరిచి వచ్చింది 

చెలి కన్నుల కదలాడిన మలయ సమీరం  
ఈడూరీ నీ వలపుకి సురుచి వచ్చింది

1 comment:

  1. గత జన్మల పుణ్యాలే నన్ను వరించే
    ఆ దేవత చిరునామా మరచి వచ్చింది. nice

    ReplyDelete