ప్రేయసితో ప్రియుని
మాట పరిమళమే ఘజల్
ఇరు మనసుల విరిసిన
సిరి సోయగమే ఘజల్
వలపు వరదలో నిండా
మమేకమయ్యేటి
అనురాగపు జంటల
యుగళ గీతమే ఘజల్
విరహముతో రగులుతున్న
జతగాడి కోసం
చెలి కబురు మోసుకొచ్చే
మారుతమే ఘజల్
వెతల లోతుల చితికి
వేసారిన బతుకులకి
మదిని మరులు
గొలిపే చెలిమి హస్తమే ఘజల్
ఈడూరి, రతిదేవి
పూనిన ప్రేమ జంటకు
మదనుడు సారించిన పూల బాణమే
ఘజల్
No comments:
Post a Comment