ఎన్నికలు, ఫలితాలు
అంతా ఒక బూటకం
పదవులకై
పందికోక్కులాడుకునే నాటకం
లోక కంటకం ||ఎన్నికలు||
ఏది గెలుపు ఏది
బలుపు
ఎందుకు ఆ తెగని
ముడి
కొన ఊపిరిలో ఎందుకు
ప్రజాస్వామ్య లోగిలి
అలసిన ఓటరుపై
కనికరం ఎవ్వరికి.....ఎవ్వరికి
వాడు కాలుతున్నా,
మసిమాడుతున్నా
గెలుపే కావాలి
పార్టీలకి, అన్ని పార్టీలకి ||ఎన్నికలు||
ఎమ్మెల్యే నీకూ
ఒకడున్నాడు
వాడు నిధులను ఏనాడో
దోచుకున్నాడు
ఐదేళ్ళలో ఏనాడూ ఇటు
రాలేదు
మళ్ళీ గెలిస్తే
వస్తాడను ఆశ లేదు
ఎవరయ్యా వినేది నీ
అత్మఘోషను
ఏనాడూ గెలిపించకు ఈ
లీడర్లను
ఈ లీడర్లను ||| ఎన్నికలు||
ఐదేళ్ళ పాలనకై కలవరించు
మూఢునికి
ఓటరన్న గుండెకోత
తెలిసేనా ఎన్నడైనా
లాలుబత్తి వెలుగులకై
పరితపించు లీడర్లకి
ఆకలిదప్పుల రోదన
వినిపించేనా ||ఎన్నికలు||
No comments:
Post a Comment