Thursday, September 24, 2015

నీనవ్వు

అపుడే విరిసిన పారిజాతమా నీనవ్వు 
ఎదలో పూసిన ప్రేమగీతమా నీనవ్వు

అలజడి మింగిన గుండెను తాకిన సమీరం 
వడిగా దూకిన సుజలపాతమా నీనవ్వు

కనులే చూడని కలగా మిగిలిన ప్రేయసీ 
ప్రేమను లేపే సుప్రభాతమా నీనవ్వు 

వడిగా లేచిన సంద్రపు కెరటం నామనసు   
కోర్కెలు పెంచే అతిమారుతమా నీనవ్వు 

హ్రుదిలో ఎపుడూ నిన్నే చూసెను ఈడూరి 
నిందలు అంటని స్వనిపునీతమా  నీనవ్వు 

No comments:

Post a Comment