Tuesday, March 8, 2011

కాల గమనం

ఒక మంచం మీద మల్లెపూవు నలుగుతోంది
మరో చోట ఓ తల్లిపేగు తెగుతోంది
ఇంకొచోట సగం చచ్చిన శవం మూలుగుతోంది
భూమి తన చుట్టూ తను తిరుగుతోంది

Friday, March 4, 2011

ఎందుకో నాకు

కళ్ళెదుటే  నువ్వున్నా కలలెందుకో నాకు
నీ తోడుగా వుంటున్నా కలతెందుకో నాకు


ఎన్నిసార్లు ఆ పెదవుల మధువులు నే తాగినా
వదల్లేదు తొలిముద్దు మత్తెందుకో నాకు


మల్లెపూల సువాసన మనసుని చుట్టేస్తున్నా
పాలుపోదు నువ్వులేని పక్కెందుకో నాకు

 
నా చుట్టూ ఎంతమంది తిరుగుతు వున్నా
ఊసుపోదు నువ్వులేక పొద్దెందుకో నాకు


అమృతాన్ని  కురిపించే నీ ప్రేమను చూస్తుంటే 
మెరుస్తుంది కళ్ళముందు అమ్మెందుకో నాకు


ఈడూరికి తోదుగా నూరేళ్ళూ నువ్వుంటే
వీడిపోదు బతుకు మీద ఆశెందుకో నాకు

Wednesday, March 2, 2011

అటో ఇటో

ప్చ్! ఏం మనిషో ఏమిటో
అడ్డు అదుపూ లేకుండా వెళిపోతున్నాడు ఎటో
అదిగో ఎదురుగా వస్తోంది ఆటో
ఇక తేలుతుంది వీడు అటో ఇటో

ఏం కావాలి?

కొందరికి రాష్ట్రం కావాలి
కొందరికి న్యాయం కావాలి
కొందరికి పనులు కావాలి
కొందరికి పదవి కావాలి
ఇచ్చేవాడు ఏం కావాలి?