Sunday, January 8, 2012

మాకుంది


తాడో పేడో తేల్చుకునే ధైర్యం మాకుంది
విజయాలు దక్కించుకునే సైన్యం మాకుంది

కాలంచెల్లిన ముసలితరం పాలన మాకొద్దు
నవచైతన్యం నింపే యువతరం మాకుంధి

సర్వనాశనం చేసే అణుబాంబులు మాకొద్దు
సహనం గెలిపించే సత్యాగ్రహం మాకుంది

గారడీలు చేసే మూఢాచారం మాకొద్దు
నిజాల నిగ్గును తేల్చే విజ్ఞానం మాకుంది

అరుపులు కేకల అరువు సంగీతం మాకొద్దు
హ్రుదయం కదిలించె భావగీతం మాకుంది

అంతులేని రహస్యాల ఆకాశం మాకొద్దు
అన్నదాత నమ్ముకున్న పుడమితల్లి మాకుంది

ఈడూరీ, పెత్తనం చేసే పెద్దన్నలు మాకొద్దు  
సైనికులై నడిపించే నాయకత్వం మాకుంది

Tuesday, January 3, 2012

ఫేసుబుక్కు


రండి చూడండి ఫేసుబుక్కు
ఎందరికో ఇస్తుంది మంచి కిక్కు
ఇక్కడ కొందరికి కలిసొస్తుంది లక్కు
మొత్తానికి ఇది భలే మేజిక్కు
ఆడవారి పోస్టులకి లైకు మీద బోల్డు క్లిక్కు
మగవారికిమాత్రం చాలా బ్యాడులక్కు
ఏమిటి లింగబేధం అని అడక్కు
దొరకని జవాబులు ఎన్నటికీ వెతక్కు
స్నేహితుల కామెంట్స్  పొగరు తలకెక్కు
చివరాఖరికి మిగిలేది ఒట్టి తుక్కు