Friday, December 28, 2012

ఢిల్లీ గ్యాంగ్ రేప్ భాదితురాలికి అశ్రు నివాళి


ఆరు రాబందులు నీమీద పడి కుళ్ళబొడిచినా
నువ్వు ధైర్యంగా బతుకు పోరాటం చేశావు
నిద్రాణమై ఉన్న ఈ దేశ యువతని
కదన రంగం వైపు మరల్చి
నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోయావు
ఓ యోధురాలా నీ దేహం నేలకొరిగినా
నీవందించిన చైతన్యం బతికే ఉంది
బతికే ఉంటుంది............

Wednesday, December 26, 2012

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా..........


నింగిలో నెలవంకలా
చంటిపాప నవ్వులా
కొలనులో కలువలా
అడవిలో నెమలిలా
అందమైన భాష

పోతనగారి పద్యంలా
వాణి వీణా వాద్యంలా
వీరేశలింగం గద్యంలా
ఎన్నోఏళ్ళ మద్యంలా
మత్తెక్కించే భాష

బాపు గీసిన గీతలా
రమణగారి రాతలా
రామలింగడి మాటలా
సాక్షివారి చురకలా
కోణంగి కొంటెభాష

శ్రీనాధుని శ్రుంగారం
అమ్మలోని మమకారం
రాయలవారి రాజసం
ఆవుపాల పాయసం
రంగరించిన తీపి భాష

శ్రీశ్రీ ఆవేశం
అన్నమయ్య పారవశ్యం 
నండూరి ఎంకిపాట
అవధానం, హరికధల విరితోట
ఉగ్గుపాల ఒగ్గుకధల భాష

దేశభాషలందు లెస్స
పలుకరా హైలెస్సా
తేనెలొలుకు మధురభాష
అచ్చమైన తెలుగుభాష 


Friday, December 14, 2012


అప్పడిగే మన అప్పారావు
ఎపుడో కలిసిన సుబ్బారావు
పక్కింటి పిన్నిగారు
చొంగ కార్చే తాతగారు
వీళ్ళంతా మన బాపు బొమ్మలే 

కాణిపాకం గణపయ్య
తిరుమల వెంకయ్య
భద్రాచల రామయ్య 
శ్రీశైలం శివయ్య 
వీళ్ళంతా మన బాపు బొమ్మలే 

శ్రుంగారమొలికించే దంపతులు
గోముగా చూసే దమయంతులు
స్నానాలు చేసే ఇంతులు
నక్కి నక్కి చూసే పంతులు
వీళ్ళంతా మన బాపు బొమ్మలే  

తెలుగుతనం గీయాలన్నా
తెలుగురాత రాయాలన్నా
తెలుగనేది ఎన్నాళ్ళున్నా
నిన్న నేడు రేపు
మనకుంటాడు బాపు!!!!
(బాపు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో....) 

షిర్డిసాయి మంగళహారతి


మంగళము సాయినాధకి ద్వారకామయి నివాసికి 
మంగళము అఖిలాండకోటి నాయకునకు 
మంగళము సాయినాధకి ద్వారకామయి నివాసికి 
మంగళము అఖిలాండకోటి నాయకునకు  

మంగళము భక్తజన శులభునకు 
మంగళము భక్తజన శులభునకు   
మంగళము షిర్డిపురాధీశునకును 

జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం