Saturday, August 27, 2016

తప్పేం కాదోయ్

అడపా దడపా అల్లరి చేయుట తప్పేం కాదోయ్
నీలో బాలుని బయటికి లాగుట తప్పేం కాదోయ్    

దైవం కన్నులు ఇచ్చినదెందుకు చూచుటకేగా 
అందం చూసీ లొట్టలు వేయుట తప్పేం కాదోయ్  

నిత్యం సైనిక పాలన అంటే కష్టం కాదా
నియమం సంకెల నిలువున తెంచుట తప్పేం కాదోయ్ 

పెద్దలు మాత్రం పిల్లలు కారా సరదాకైనా
పుల్లల ఐసును ఫుల్లుగ చీకుట తప్పేం కాదోయ్

సినిమాకెడితే చేతులు ముడుచుకు కూచుంటారా
ఐటెం సాంగుకు ఈలలు కొట్టుట తప్పేం కాదోయ్ 

బోడిగ గుండును చూస్తూ ఊరికె వదిలెయగలమా 
టోపీ లాగీ ఒక్కటి మొట్టుట తప్పేం కాదోయ్ 

నిజాలు పలికిన రాజుకి దక్కెను స్మశాన వాటిక
అవసరానికో అబధ్ధమాడుట తప్పేం కాదోయ్

2 comments:

  1. తప్పులేదని సరిపెట్టుకోమంటారా :-)
    సరదాగా బాగుందండి.

    ReplyDelete
  2. సరిపెట్టుకోండీ సరదాగా......ధన్యవాదాలు పద్మార్పిత గారు

    ReplyDelete