Saturday, July 19, 2014

జీవిత చక్రం

ఒంటరిగానే మొదలవుతుంది జీవితం
ఒంటరిగానే ముగుస్తుంది
ఎవరి చావు వారిదే........

మొదలెక్కడో తెలియని జీవితం
తనకంటూ మరో గర్భాన్ని వెదుక్కుంటుంది
మళ్ళీ అంకురమై మొలుస్తుంది

ఒకటొకటిగా తన చుట్టూ బంధాల్ని అల్లుకుంటుంది
ఒక్కో ఇటుకా పేర్చి ఒక భవంతిని నిర్మించినట్టు
ఒక కుటుంబం తయారౌతుంది

అనుభంధాలు పెరుగుతాయి, అనురాగాలు పండుతాయి 
వచ్చే పోయే వానలా కష్టాలూ, కడగండ్లూ వస్తుంటాయి 
బంధాలతోపాటే బీటలూ పెరుగుతాయి 

ఎందుకో ఓరోజు జీవితం ఉన్నట్టుండి అలిసిపోతుంది 
తనకంటూ ఎవరున్నారని తనను తాను ప్రశ్నిస్తుంది
కొత్త గర్భం కోసం మరో వేట మొదలౌతుంది


2 comments:

  1. మంచి విషయాన్ని ఎంచుకొనటం బాగుంది . కొంచెం మార్పులతో భావం బలపడ్తుంది . ఆలోచించి చూడండి .
    బాగుంటే కరెక్ట్ చేసుకోండి , లేకుంటే టేకిట్ ఈజీ .

    కొందరితో మొదలైన జీవితం ,
    ఒకటొకటిగా తన చుట్టూ బంధాల్ని అల్లుకుంటుంది
    ఒక్కో ఇటుకా పేర్చి ఒక భవంతిని నిర్మించినట్టు
    ఒక కుటుంబాన్ని తయారు చేసుకొంటుంది .

    అనుభంధాలు పెంచుకొంటుంది ,
    అనురాగాలు పంచుతుంది .
    వచ్చే పోయే వానలా కష్టాలూ, కడగండ్లూ ,
    బంధాలతోపాటే భేటీలు ,బీటలూ .

    అలా అలసిన ఈ జీవితం ఓరోజు ,
    తనకంటూ ఎవరున్నారని తనను తాను ప్రశ్నించుకుని ,
    ఒంటరిగానే పయనమై పోతోంది
    సుదూరతీరాల దిశగా .

    కొత్త గర్భం కోసం మళ్ళీ వేట మొదలౌతుంది

    మొదలెక్కడో తెలియని ఆ జీవి
    తనకంటూ మరో గర్భాన్ని వెదుక్కుంటుంది
    మళ్ళీ అంకురమై మొలుస్తుంది
    ఇదే ప్రాణికోటి ( జీవి ) జీవిత చక్రం

    ReplyDelete