Wednesday, December 26, 2012

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా..........


నింగిలో నెలవంకలా
చంటిపాప నవ్వులా
కొలనులో కలువలా
అడవిలో నెమలిలా
అందమైన భాష

పోతనగారి పద్యంలా
వాణి వీణా వాద్యంలా
వీరేశలింగం గద్యంలా
ఎన్నోఏళ్ళ మద్యంలా
మత్తెక్కించే భాష

బాపు గీసిన గీతలా
రమణగారి రాతలా
రామలింగడి మాటలా
సాక్షివారి చురకలా
కోణంగి కొంటెభాష

శ్రీనాధుని శ్రుంగారం
అమ్మలోని మమకారం
రాయలవారి రాజసం
ఆవుపాల పాయసం
రంగరించిన తీపి భాష

శ్రీశ్రీ ఆవేశం
అన్నమయ్య పారవశ్యం 
నండూరి ఎంకిపాట
అవధానం, హరికధల విరితోట
ఉగ్గుపాల ఒగ్గుకధల భాష

దేశభాషలందు లెస్స
పలుకరా హైలెస్సా
తేనెలొలుకు మధురభాష
అచ్చమైన తెలుగుభాష 


4 comments: