కళ్ళెదుటే నువ్వున్నా కలలెందుకో నాకు
నీ తోడుగా వుంటున్నా కలతెందుకో నాకు
ఎన్నిసార్లు ఆ పెదవుల మధువులు నే తాగినా
వదల్లేదు తొలిముద్దు మత్తెందుకో నాకు
మల్లెపూల సువాసన మనసుని చుట్టేస్తున్నా
పాలుపోదు నువ్వులేని పక్కెందుకో నాకు
నా చుట్టూ ఎంతమంది తిరుగుతు వున్నా
ఊసుపోదు నువ్వులేక పొద్దెందుకో నాకు
అమృతాన్ని కురిపించే నీ ప్రేమను చూస్తుంటే
మెరుస్తుంది కళ్ళముందు అమ్మెందుకో నాకు
ఈడూరికి తోదుగా నూరేళ్ళూ నువ్వుంటే
వీడిపోదు బతుకు మీద ఆశెందుకో నాకు
నీ తోడుగా వుంటున్నా కలతెందుకో నాకు
ఎన్నిసార్లు ఆ పెదవుల మధువులు నే తాగినా
వదల్లేదు తొలిముద్దు మత్తెందుకో నాకు
మల్లెపూల సువాసన మనసుని చుట్టేస్తున్నా
పాలుపోదు నువ్వులేని పక్కెందుకో నాకు
నా చుట్టూ ఎంతమంది తిరుగుతు వున్నా
ఊసుపోదు నువ్వులేక పొద్దెందుకో నాకు
అమృతాన్ని కురిపించే నీ ప్రేమను చూస్తుంటే
మెరుస్తుంది కళ్ళముందు అమ్మెందుకో నాకు
ఈడూరికి తోదుగా నూరేళ్ళూ నువ్వుంటే
వీడిపోదు బతుకు మీద ఆశెందుకో నాకు
No comments:
Post a Comment